పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టాప్లో లేదా అట్టడుగున ఉంటుందని జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తెలిపారు. జేడీ(యూ) 25 కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ కూడా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కూటమి మూడో స్థానానికి పరిమితమవుతుందని అంచనా వేశారు. తన పార్టీ జన్ సూరజ్ 243 సీట్లలో పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. తన పార్టీ అగ్రస్థానంలో లేదా దిగువన ఉంటుందని అన్నారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది నాలుగు లేదా ఐదు రోజుల్లో తాను నిర్ణయిస్తానని ఎన్నికల వ్యూహకర్తగా, సలహాదారుగా పనిచేసి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరని స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. జేడీ(యూ) నేత, బీహార్ మంత్రి అశోక్ చౌదరికి పరువు నష్టం నోటీసు పంపుతానని తెలిపారు. రూ. 200 కోట్ల అవినీతికి ఆయన పాల్పడినట్లు ఆరోపించారు. కోట్ల విలువైన ఆ భూమిని తన పీఏ పేరుతో ఆయన ఎందుకు కొన్నారు? అని ప్రశ్నించారు. త్వరలోనే నలుగురు లేదా ఐదుగురు ప్రముఖ నేతల గుట్టు బయటపెడతానని ఆయన అన్నారు.
Also Read:
Case On Congress Leader’s Son | ఇద్దరు వ్యక్తులపై దాడి.. కాంగ్రెస్ నేత కుమారుడిపై కేసు
Sonam Raghuvanshi | దసరా రోజున.. సోనమ్ దిష్టిబొమ్మ దహనాన్ని నిషేధించిన కోర్టు
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసి ఆరు నెలలుగా అత్యాచారం.. రక్షించిన పోలీసులు