పనాజీ: బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలి ప్రైవేట్ ఫోటోలను ఒక వ్యక్తి లీక్ చేశాడు. ఆ మహిళ పేరులో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచాడు. ఆమె స్నేహితులు, ఇతరులకు వాటిని షేర్ చేశాడు. (Private Photos Leak) బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాకు చెందిన 23 ఏళ్ల మహ్మద్ సాధీమ్ తన ప్రియురాలి నుంచి విడిపోయాడు. అయితే వారిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు తీసుకున్న ప్రైవేట్ ఫొటోలు సంపాదించాడు. ఆ మహిళ పేరులో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచాడు. అందులో ఆమె ప్రైవేట్ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఆ మహిళ స్నేహితులకు వాటిని షేర్ చేశాడు.
కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. మహ్మద్ సాధీమ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మార్గోవా, పనాజీలో వెతికిన పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో సాధీమ్ను హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
trains Coaches decouple | గంటలోపు.. రెండుసార్లు విడిపోయిన రైల్ కోచ్లు
Trainer Aircraft Skids Off Runway | రన్వే నుంచి జారిన శిక్షణ విమానం.. పైలట్ సురక్షితం
Sonam Raghuvanshi | దసరా రోజున.. సోనమ్ దిష్టిబొమ్మ దహనాన్ని నిషేధించిన కోర్టు
Watch: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్తులు