భోపాల్: ఆలయ ఉత్సవం వద్ద ఏర్పాటు చేసిన జైంట్ వీల్ హుక్ తెగిపోయింది. దీంతో అది ఒక పక్కకు ఒరిగిపోయింది. (Giant Wheel Swing tilts ) గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు. చివరకు వారిని సురక్షితంగా కిందకు దించారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖండేరా ధామ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ జైంట్ వీల్, ఊయాలలు వంటివి అక్కడ ఏర్పాటు చేశారు.
కాగా, ఆదివారం సాయంత్రం భారీ జైంట్ వీల్ హుక్ తెగిపోయింది. దీంతో అది పక్కకు ఒరిగిపోయింది. ఆ వీల్‌పై గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు.
మరోవైపు పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించారు. ఒరిగిన జైంట్ వీల్‌పై ఉన్న వారిని సురక్షితంగా కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మాన్యువల్‌గా ఆపరేట్ చేసే జైంట్ వీల్ హుక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వీల్‌ను తొలగించినట్లు చెప్పారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
मध्य प्रदेश के रायसेन के खंडेरा मंदिर मेले में अचानक झुका झूला, कई फीट ऊपर अटकी लोगों की जान, पुलिस ने लोगों को सुरक्षित नीचे उतारा, गनीमत रही इस हादसे में किसी को चोट नहीं आई.#MadhyaPradesh #FerrisWheelAccident #Raisen #ATReel #AajTakSocial pic.twitter.com/oTV8sonjqy
— AajTak (@aajtak) September 28, 2025
Also Read:
Woman Thrashes Children | చికెన్ కావాలని అడిగిన పిల్లలు.. చపాతీ కర్రతో కొట్టిన తల్లి, కొడుకు మృతి
Private Photos Leak | బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలి ప్రైవేట్ ఫొటోలు లీక్.. వ్యక్తి అరెస్ట్
Watch: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్తులు