వాషింగ్టన్ : ఇరాన్లో 7 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై తాము దాడులు చేయలేదని, ప్రధానంగా వాణిజ్య, మిలిటరీ కేంద్రాలపైనే దాడులు చేసినట్టు చెప్పారు. ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌లో ఆయిల్ పెసిలిటీస్ తప్ప మిగతా అన్నింటినీ ధ్వంసం చేశామన్నారు. హొర్ముజ్ జలసంధిని తెరువడంలో అమెరికాకు సాయం అందించేందుకు చాలా దేశాలు ఉత్సాహంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్టు, ఒక కాలు కోల్పోయినట్టు తాను విన్నానని పేర్కొన్నారు. 9/11 దాడిని ఏడాది ముందే తాను ఊహించానని ట్రంప్ తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 16: భారతీయులు ఇరాన్‌ను వీడటంపై భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. తమను సంప్రదించకుండా ఇరాన్ సరిహద్దులకు చేరుకొని అక్కడ్నుంచి భూమార్గంలో ఇరాన్‌ను వీడటం తగదని భారత అధికారులు హెచ్చరించారు. దీనివల్ల భారత పౌరులు ఇమిగ్రేషన్ సహా పలు చిక్కుల్లో పడతారని తెలిపింది. భారతీయులు తమను సంప్రదించకుండా.. భూమార్గంలో లేదా సరిహద్దు ద్వారా ఆ దేశాన్ని వీడే ప్రయత్నం చేయరాదంటూ హెచ్చరించింది.