Dinesh Chandimal | గాలే టెస్టు.. గాయంతో మైదానం వీడిన శ్రీలంక బ్యాటర్..!
Dinesh Chandimal : స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో శ్రీలంక కష్టాలు తప్పడం లేదు. అసలే బౌలర్ల వైఫల్యంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగా.. ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
Dinesh Chandimal : స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో శ్రీలంక కష్టాలు తప్పడం లేదు. అసలే బౌలర్ల వైఫల్యంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగా.. ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు. నాలుగో రోజు బౌండరీ ఆపే క్రమంలో దినేశ్ చండీమాల్(Dinesh Chandimal) మెడ, భుజానికి తీవ్ర గాయంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫీజియో వచ్చి పరీక్షించినా ఉపశమనం లేకపోవడంతో చండీమాల్ మైదానం వీడాడు.
గాలే టెస్టులో శ్రీలంక మిడిలార్డర్ ఆటగాడు దినేశ్ చండీమాల్ అనూహ్యంగా మైదానం వీడాడు. నాలుగోరోజు టీమిండియా ఇన్నింగ్స్ మొదలైన నాలుగో ఓవర్లోనే అతడు గాయపడడమే అందుకు కారణం. డీప్ స్క్వేర్ దిశలో ఓపెనర్ కేఎల్ రాహుల్ కొట్టిన బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపేందుకు పరుగెత్తిన చండీమాల్ ప్రమాదకరంగా డైవ్ చేశాడు.
INJURY UPDATE: After going over his neck while diving at the boundary, Dinesh Chandimal went off the field and has now been taken to a hospital for scans pic.twitter.com/R9WHy5zN7f
— Cricinfo (@cricinfo) August 18, 2026
డైవ్ కారణంగా చండీమాల్ మెడ, కుడి భుజానికి గాయలయ్యాయి. దాంతో, ఫీజియో వచ్చి పరీశీలించాడు. వెంటనే అతడిని బయటకు తీసుకొచ్చి శ్రీలంక వైద్యబృందం పరీక్షించింది. అనంతరం అదనపు పరీక్షల కోసం చండీమాల్ను ఆస్పత్రికి తరలించారు. గాయంతో మైదానం వీడిన అతడి స్థానంలో పసిందు సూర్యబండారా ఫీల్డింగ్కు వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులకే ఔటైన చండీమల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

