గాలే: రిషబ్ పంత్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. టెస్టుల్లో వంద సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 89 ఇన్నింగ్స్‌లోనే వంద సిక్సర్లు బాదాడు పంత్. డీప్ ఫైన్ లెగ్‌లో స్వీప్ షాట్ సిక్సర్‌తో ఈ మ్యాచ్‌లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 66 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ రెండు సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో ఫాస్టెస్ట్ 100 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. 4918 బంతుల్లో పంత్ వంద సిక్సులు బాదాడు. గతంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఆ రికార్డు ఉన్నది. 6,578 బంతుల్లో గిల్‌క్రిస్ట్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు.
Maximum number 1⃣0⃣0⃣ in Test Cricket for Rishabh Pant! 💥
He becomes the first #TeamIndia batter to reach that special milestone in men’s cricket 🫡🫡
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/24yVuJ7FzX
— BCCI (@BCCI) August 18, 2026
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో బెన్ స్టోక్స్ ముందున్నాడు. అతను 138 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 107 సిక్సర్లు కొట్టాడు. ఫాస్టెస్ట్ మైలురాయి అందుకున్న ప్లేయర్లలో పంత్ ఫస్ట్ నిలిచాడు. స్టోక్స్ కన్నా 31 మ్యాచులు తక్కువే ఆడాడు పంత్. 2025 తర్వాత సిక్సర్లు కొట్టే సామర్థ్యాన్ని పంత్ పెంచాడు. గడిచిన 16 ఇన్నింగ్స్‌లో అతను 32 సిక్సర్లు బాదాడు. కేవలం 2025లోనే అతను 26 సిక్సర్లు కొట్టాడు.వంద సిక్సర్లలో 76 సిక్సర్లు కేవలం స్పిన్ బౌలింగ్‌లోనే బాదాడు పంత్.
మరో వైపు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో తాజా సమాచారం ప్రకారం 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది. భారత్ ఆధిక్యం 350 రన్స్ దాటింది.