బెంగళూరు: ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వాటితో తనను బెదిరిస్తున్నాడని, ఇతర వ్యక్తులతో పడుకోవాలని బలవంతం చేస్తున్నాడని ఒక మహిళ ఆరోపించింది. మానసిక, భౌతిక వేధింపులపై భర్తతో పాటు అత్తింటి వారిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. (Wife Claims Husband Recorded Videos) కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. 2024 డిసెంబర్లో ఒక మహిళకు సయ్యద్ ఇనాముల్ హక్తో పెళ్లి జరిగింది. తన భర్తకు అప్పటికే వివాహం జరిగినట్లు తెలుసుకుని ఆమె షాక్ అయ్యింది.
కాగా, ఆ మహిళ తనకు రెండో భార్య అని సయ్యద్ ఆమెకు తెలిపాడు. అలాగే 19 మంది మహిళలతో తనకు సంబంధం ఉన్నదని చెప్పాడు. బెడ్రూమ్లో ఉంచిన రహస్య కెమెరా ద్వారా భార్య ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. విదేశాల్లో ఉన్న తన స్నేహితులకు వాటిని షేర్ చేశాడు. అలాగే వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. లేకపోతే ఆమె ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
మరోవైపు బహిరంగ ప్రదేశాలతోపాటు తన తల్లిదండ్రుల ఇంట్లో కూడా భర్త పదే పదే శారీరకంగా, మానసికంగా వేధించినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఫ్లాట్ కొనడానికి తన బంగారు నగలు అమ్మాలని ఒత్తిడి తెచ్చాడని, తాను నిరాకరించడంతో తనను కొట్టాడని పేర్కొంది.
కాగా, సెప్టెంబర్ 21న గొడవ పడిన భర్త సయ్యద్ తనను కొట్టి ఇంటి నుంచి పారిపోయాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటివారు కూడా తనను మానసికంగా, భౌతికంగా, లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Tej Pratap | రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో తేజస్వీ అర్థం చేసుకోవాలి: తేజ్ ప్రతాప్
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి