అహ్మదాబాద్: మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను వివాహితుడైన ప్రియుడు హత్య చేశాడు. (Lover Kills Woman cop) ఆమె నగ్న మృతదేహాన్ని స్టాఫ్ క్వార్టర్లో గుర్తించారు. వారిద్దరి మధ్య 15 ఏళ్లుగా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. అహ్మదాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగళవారం హత్యకు గురైంది. గాంధీనగర్‌లోని పోలీస్ సిబ్బంది క్వాటర్స్‌లో నగ్నంగా ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిఘా ద్వారా కొన్ని గంటల్లోనే నిందితుడ్ని గుర్తించారు. మహిళా కానిస్టేబుల్‌తో 15 ఏళ్లుగా సంబంధం ఉన్న మోహన్ పార్ఘిని అమ్రేలిలో అరెస్ట్ చేశారు.
కాగా, కాలేజీలో చదువుతున్నప్పుడే 2012 నుంచి మహిళా కానిస్టేబుల్, మోహన్ మధ్య పరిచయం ఉన్నదని దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. 2015లో అతడికి పెళ్లి కాగా, ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లు తెలిసింది.
మరోవైపు సోదరుడు, వదినతో కలిసి ఆ మహిళా కానిస్టేబుల్ నివసిస్తున్నది. రెండు రోజుల కిందట అన్నా, వదిన తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె మోహన్‌ను కలిసేందుకు ప్లాన్ వేసింది. గాంధీనగర్‌లోని పోలీస్ సిబ్బంది క్వాటర్స్‌కు అతడ్ని రప్పించింది.
అయితే ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో హత్య చేసినట్లు నిందితుడు మోహన్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి
Netanyahu Apology To Qatar | ట్రంప్ ఒడిలో ఫోన్.. ఖతార్‌కు నెతన్యాహు క్షమాపణ