Netanyahu Apology To Qatar | ట్రంప్ ఒడిలో ఫోన్.. ఖతార్‌కు నెతన్యాహు క్షమాపణ
Netanyahu Apology To Qatar | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ ఫోన్లో మాట్లాడారు. ఖతార్‌పై దాడి చేసినందుకు ఆ దేశ ప్రధానికి క్షమాపణ చెప్పారు. ఈ ఫొటోను వైట్ హౌస్ విడుదల చేసింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ ఫోన్లో మాట్లాడారు. ఖతార్‌పై దాడి చేసినందుకు ఆ దేశ ప్రధానికి క్షమాపణ చెప్పారు. (Netanyahu Apology To Qatar) ఈ ఫొటోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇటీవల ఖతార్‌లోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ సంఘటనలో ఖతార్ పౌరుడు మరణించాడు.
కాగా, మిత్ర దేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ సందర్భంగా ట్రంప్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడించారు.
మరోవైపు ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకోగా నెతన్యాహు క్షమాపణ లేఖ చదివారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లు ఆయన ఒప్పుకున్నారు. తమ దేశం మళ్లీ అలాంటి దాడి చేయదని హామీ ఇచ్చారు. నెతన్యాహు క్షమాపణలను ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కాగా, వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

