భువనేవ్వర్: ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంట్లో చొరబడేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఆమె ఇంటి గోడ ఎక్కి దూకాడు. కరెంట్ వైర్ తాకడంతో విద్యుదాఘాతంతో మరణించాడు. (Teen Sneak Into Girlfriend’s House) అయితే తమ కుమారుడి మృతికి ప్రియురాలి కుటుంబం కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 28న ఆదివారం రాత్రి వేళ రహస్యంగా ప్రియురాలిని కలిసేందుకు 18 ఏళ్ల బిశ్వజిత్ బెహెరా ప్రయత్నించాడు. ఆమె ఇంటికి వెళ్లి గోడ దూకాడు. అయితే విద్యుత్ వైర్ తగలడంతో షాక్‌తో అక్కడ కుప్పకూలిపోయాడు. విద్యుదాఘాతంతో మరణించాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బిశ్వజిత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే తమ కుమారుడి మరణంపై అతడి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ప్రియురాలి బంధువులు హత్య చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుదాఘాతానికి సంబంధించిన కేసుగా కనిపిస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆ యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాత తెలుస్తుందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Watch: ఫుడ్ డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?