‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటిన నిహారిక కొణిదెల.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. సంగీత్శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానసశర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘పదే పదే..’ అంటూ సాగే పాటని హైదరాబాద్‌లోని సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో రిలీజ్ చేశారు. ప్రేమకై ప్రాధేయపడకూడదని, మనమే ప్రేమలా మారిపోవాలని, అదే ఈ పాటలోని ఆంతర్యమని నిహారిక చెప్పారు. ఇంకా సంగీత్ శోభన్, నయన్ సారిక, సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ కూడా మాట్లాడారు.