పాట్నా: బీహార్ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap) తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు. ఆర్జేడీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్, జనశక్తి జనతాదళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్ తన అన్నపై పలు ఆరోపణలు చేశారు. ఆయన ఆర్జేడీలో ఉన్నప్పుడు తన సన్నిహితులను రెబల్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దించినట్లు విమర్శించారు.
కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ దీనిపై స్పందించారు. లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్ వ్యవహరించాలని సూచించారు. ‘రాముడి విషయంలో లక్ష్మణుడు చేసినట్లుగానే తమ్ముడిగా మర్యాదతో వ్యవహరించాలి. జైచంద్ లాంటి వ్యక్తులే ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని అన్నారు.
మరోవైపు హసన్పూర్ ఎమ్మెల్యే అయిన తేజ్ ప్రతాప్ త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తమ్ముడు తేజస్వీ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్న ఈ స్థానం నుంచి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన పోటీ చేశారు.
Also Read:
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు