ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి : వీడియో
నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ..
నీలగిరి, మార్చి 12 : నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(70) తన భర్త పిచ్చిరెడ్డి కి చెవుల మిషన్ (ear mission) కొనేందుకు గురువారం ఉదయం సమయంలో నల్లగొండకు వచ్చింది. బస్టాండ్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్లగొండ బస్టాండ్ సమీపంలో రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో బస్టాండ్ లోపలికి, వెలుపలికి బస్సులు ఒకే మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. ఇటు ఆర్టీసీ సిబ్బంది గానీ, అటు ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ గానీ సరిగ్గా లేకపోవడంతో సుభాష్ సెంటర్ అలాగే బస్సులు లోపలికి, బయటకి వచ్చే మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది.
సీసీటీవీ ఫుటేజ్
నల్గొండ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం
రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన RTC ఎలక్ట్రిక్ బస్సు
అక్కడికక్కడే మహిళ మృతి pic.twitter.com/0JDAi6MyzN
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

