Team India Schedule : స్వదేశంలో పొట్టి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన భారత జట్టు(Team India) ఏడాదంతా బిజీబిజీగా గడపనుంది. ఐపీఎల్ (IPL 2026) ముగియడమే ఆలస్యం.. ఇంగ్లండ్ పర్యటనతో మొదలు.. తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. శ్రీలంకలో వరద బాధితుల సహాయార్ధం నిధుల సమీకరణ కోసం పొట్టి సిరీస్‌లో భారత్ ఆడనుంది. ఐర్లాండ్, జింబాబ్వే.. యూఏఈ, బంగ్లాదేశ్ జట్లతో సిరీస్‌లు అంటూ మెన్ ఇన్ బ్లూ అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచనుంది. ఈ క్రమంలోనే ఆసియా క్రీడలు వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతను కూడా బేరీజు వేసుకోనుంది. మరి.. వచ్చే 12 నెలల్లో ఏ జట్టుతో, ఏ ఫార్మాట్లో, ఎన్నేసి మ్యాచుల్లో భారత జట్టు తలపడనుందో చూద్దాం.
మూడోసారి టీ20 వరల్డ్‌కప్ గెలుపొందిన భారత జట్టు.. ఐపీఎల్ అనంతరం విదేశీ, స్వదేశీ సిరీస్‌లతో అభిమానులను అలరించనుంది. 19వ సీజన్ ఐపీఎల్ ముగిశాక.. జూన్‌లో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఆపై ఇంగ్లండ్ పర్యటనకు భారత బృందం వెళ్లనుంది. జూలై 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వన్డే, టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
Here is Team India’s likely busy schedule for the 2026 calendar year! 🇮🇳🗓️💪
Which series are you eagerly waiting for? 👀🏏#India #Tests #ODIs #T20Is #Sportskeeda pic.twitter.com/F5hnwLnIe4
— Sportskeeda (@Sportskeeda) January 1, 2026
అనంతరం ఐర్లాండ్‌తో సిరీస్‌లో.. జూలై- ఆగస్టు మధ్య శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. ఆ దేశ బోర్డు అభ్యర్థన మేరకు వరద బాధితుల సహాయార్ధం నిధుల సమీకరణ సిరీస్‌లో సూర్యకుమార్ సేన ఆడనుంది. నిరుడు నవంబర్‌లో దిత్వా తుఫాన్ లంకను అతలాకుతలం చేసి.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైంది. ఆ విపత్తు సమయంలోనే నిత్యావసరాలు చేరవేసిన భారత ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల సమీకరణకు క్రికెట్ మ్యాచ్‌లకు పచ్చజెండా ఊపింది.
శ్రీలంకతో పొట్టి సిరీస్ ముగియగానే టీమిండియా – అఫ్గనిస్థాన్ సిరీస్ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. అనంతరం బంగ్లాదేశ్‌తో ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్(మూడు వన్డేలు, మూడు టీ20లు)లో భారత్ తలపడనుంది. షెడ్యూల్ ప్రకారం నిరుడు ఆగస్టులో జరగాల్సిన ఈ సిరీస్ బంగ్లాలో అందోళనల నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం ఉస్మాన్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం స్నేహ హస్తం చాటుతుండంతో బంగ్లాదేశ్‌కు జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం అడ్డు చెప్పకపోవచ్చు. బంగ్లాతో సిరీస్ పూర్తవ్వంగానే .. కాస్త విరామం తీసుకొని జింబాబ్వే పర్యటనకు భారత జట్టు వెళ్లే అవకాశముంది. అయితే.. ఇప్పటికైతే షెడ్యూల్ ఇంకా ఖరారవ్వలేదు.

ఈ ఏడాది ఆసియా క్రీడల కోసం భారత జట్టు సెప్టెంబర్‌లో జపాన్ వెళ్లనుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ జరిగే ఈ మెగా టోర్నీ జరుగనుంది. పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా టోర్నీలో నిరుడు స్వర్ణం గెలుపొందిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై భారత బృందం అడుగు పెట్టనుంది. అక్టోబర్ 18 నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, ఐదు టీ20ల్లో ఆడనుంది. వైట్ బాల్ సిరీస్ ముగిశాక ఇరుజట్లు రెండు టెస్టుల్లో తాడోపేడో తేల్చుకుంటాయి.
కివీస్‌తో టెస్టు సిరీస్ పూర్తయ్యాక.. డిసెంబర్ తొలివారంలో భారత జట్టు స్వదేశం రానుంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడేసి చొప్పున వన్డేలు, టీ20ల్లో తలపడుతుంది. లంకతో సిరీస్ ముగియడమే ఆలస్యం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా జట్టు వాలిపోనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య.. టీమిండియా, ఆసీస్ మధ్య రసవత్తరంగా టెస్ట్ ఫైట్ జరుగనుంది. ఈ బిజీ క్రికెట్ షెడ్యూల్ పూర్తి కాగానే.. ఐపీఎల్ సందడి మొదలవ్వనుంది.