YS Jagan | ప్రియాంక తండ్రి ఆవేదనకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాల్సిందే: వైఎస్ జగన్
YS jagan | డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్ విమర్శించారు. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని మండిపడ్డారు.
YS Jagan | అమరావతి: రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి ప్రియాంకను డాక్టర్‌గా తీర్చిదిద్దారని, ఎండీ చదువులు కూడా చదివిస్తున్న సమయంలో ఆమె మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్ విమర్శించారు. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించేవారిమీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే… మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరమని అన్నారు.
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి! దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారుతోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబుగారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. అంతేకాదు వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరుకూడా దీనికి మరో కారణమని అన్నారు. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని మండిపడ్డారు.
పౌరులందరిపట్లా ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి, కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని చంద్రబాబు ఇప్పటికైనా గమనిస్తే మంచిదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

