మరో జెన్‌జీ ఉద్యమానికి సిద్ధం కావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి యువత మరో జెన్‌జీ ఉద్యమానికి సిద్ధం కావాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ యువ మంచ్ జాతీయ వైస్ చైర్మన్, రాజ్యసభ మాజీ ఎంపీ బృందాకారత్ పిలుపునిచ్చారు.
- రాజ్యసభ మాజీ ఎంపీ బృందాకారత్
ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి యువత మరో జెన్‌జీ ఉద్యమానికి సిద్ధం కావాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ యువ మంచ్ జాతీయ వైస్ చైర్మన్, రాజ్యసభ మాజీ ఎంపీ బృందాకారత్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేర్పల్లి అశోక్ అధ్యక్షతన నిర్వహించిన నాలుగో రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు, ప్రధాన కార్యదర్శి పూసమ్ సచిన్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లుంబిని దీక్ష భూమిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. పోరాటాల పురిటి గడ్డ, త్యాగాలకు అడ్డాగా ఉన్న ఆసిఫాబాద్ నుంచి కుమ్రం భీం స్ఫూర్తితో ఆదివాసీల హకుల రక్షణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పులుల సంరక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాల్లో తాము చేసిన పోరా టం.. సాధించిన విజయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను క ట్టు బానిసలుగా మారుస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

