Actress | హీరోయిన్‌కు షాకిచ్చిన లేడీ ఫ్యాన్ .. లిప్‌లాక్ వీడియో వైరల్!
Actress | సెలబ్రిటీలను అభిమానులు ఆప్యాయంగా కలుసుకోవడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం సాధారణమే. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం తారలకు ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ నటి నికితా రావల్‌కు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఆమెకు బలవంతంగా లిప్‌లాక్ ఇవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Actress | సెలబ్రిటీలను అభిమానులు ఆప్యాయంగా కలుసుకోవడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం సాధారణమే. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం తారలకు ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ నటి నికితా రావల్‌కు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఆమెకు బలవంతంగా లిప్‌లాక్ ఇవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నికితా రావల్ రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిస్తూ కనిపించారు. అదే సమయంలో ఓ మహిళా అభిమాని ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకోవాలని కోరింది. అభిమాని కోరికను నికితా సంతోషంగా అంగీకరించి ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఆ తర్వాతే ఊహించని ఘటన చోటుచేసుకుంది.
సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆ మహిళ ఒక్కసారిగా నికితా చెంపపై ముద్దుపెట్టింది. అంతటితో ఆగకుండా ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కుని పెదవులపై బలవంతంగా ముద్దుపెట్టింది. ఈ పరిణామంతో నికితా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడున్నవారు కూడా ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యపోయారు.నికితా ఆ మహిళను దూరంగా పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె గట్టిగా పట్టుకోవడంతో వెంటనే తప్పించుకోలేకపోయారు. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ మహిళా అభిమానిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన అనంతరం నికితా కొన్ని క్షణాల పాటు తీవ్ర అసౌకర్యానికి గురైంది. అనంతరం భావోద్వేగానికి గురైన ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళా అభిమాని ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం ఉన్నప్పటికీ సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులను గౌరవించాలని, వారి అనుమతి లేకుండా శారీరకంగా తాకడం లేదా ముద్దు పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మహిళా సెలబ్రిటీలకే కాకుండా ఏ నటుడికైనా, ఏ వ్యక్తికైనా అసౌకర్యాన్ని కలిగించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇక నికితా రావల్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బ్లాక్ & వైట్’, ‘మిస్టర్ హాట్ మిస్టర్ కూల్’, ‘ది హీరో – అభిమన్యు’, ‘అమ్మా కి బోలి’, ‘గరం మసాలా’, ‘క్యూట్ కమీనా’ తదితర సినిమాల్లో ఆమె కనిపించారు. 2012లో ‘తింపా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం అర్షద్ వార్సీ, చంకీ పాండే తదితరులతో కలిసి ‘రోటీ కప్డా ఔర్ రొమాన్స్’ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
WTF just happened here 🤯👀
Nikita Rawal was posing, her fan girl came took a selfie, kissed her on cheeks and then grabs her tightly, does a Lip kiss 🤯
She pulls back with a surprised expression, covering her mouth with full of embarrassment. Biggest oops moment for her life pic.twitter.com/RnIn2kVWhO
— Chota Don (@choga_don) August 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- lady fan
- lip kiss
- nikita rawal
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

