చండీగఢ్: తన భార్యకు ఆమె పుట్టింటి వారు మళ్లీ పెళ్లి చేసినట్లు ఒక వ్యక్తి ఆరోపించాడు. తనతో జరిగిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో డిలీట్ చేయనందుకు కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Wife Married Again By In-Laws) దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని సోనిపట్‌లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల కునాల్, ప్రియురాలైన 21 ఏళ్ల కోమల్ ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలల తర్వాత 2024 జూన్‌లో కోమల్ పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. భరణం కింద నెలకు రూ.30,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది.
కాగా, కోమల్‌కు ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే కునాల్‌తో ఆమె ప్రేమ పెళ్లి ఫొటోలను అత్తింటి వారు సోషల్ మీడియాలో చూశారు. ఈ నేపథ్యంలో వాటిని డిలీట్ చేయాలని కునాల్‌ను కోమల్ తండ్రి బెదిరించాడు.
Kunal
మరోవైపు సెప్టెంబర్ 24న తన తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న కునాల్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కోమల్‌తో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయాలని ఆమె తండ్రి సతీశ్, బంధువుల సమక్షంలో డిమాండ్ చేశారు. అతడు వినకపోవడంతో కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన కునాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Delivery Boy Kidnaps, Rapes Girl | బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన డెలివరీ బాయ్
Woman Murders Daughter, Kills Self | కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం
Tej Pratap | రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో తేజస్వీ అర్థం చేసుకోవాలి: తేజ్ ప్రతాప్