బెంగళూరు: ఒక మహిళ తన కుమార్తెను హత్య చేసింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Murders Daughter, Kills Self) నైట్ షిప్ట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త పొరుగువారి సహాయంతో ఇది గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఆసుపత్రిలోని నర్సుల క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు.
కాగా, నైట్ షిఫ్ట్ తర్వాత ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చాడు. 38 ఏళ్ల భార్య శృతి ఎంతకీ డోర్ తీయకపోవడంతో పొరుగువారి సహాయంతో తలుపులు పగలగొట్టాడు. లోనికి వెళ్లి చూడగా 12 ఏళ్ల కుమార్తె పూర్విక తలకు గాయంతో విగతజీవిగా పడి ఉన్నది. భార్య శృతి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుమార్తెను హత్య చేసిన తర్వాత శృతి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య, అసహజ మరణం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మానసిక ఆరోగ్య సమస్యలతో శృతి బాధపడుతున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం
Tej Pratap | రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో తేజస్వీ అర్థం చేసుకోవాలి: తేజ్ ప్రతాప్