Indian Wells : పురుషుల టెన్నిస్‌లో వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్కరాస్‌కు రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) చెక్ పెట్టాడు. ఏకంగా 16 విక్టరీలతో ఇండియన్ వెల్స్(Indian Wells) ఫైనల్‌పై కన్నేసిన స్పెయిన్ స్టార్‌ను మెద్వెదేవ్ ఇంటికి పంపాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో సంచలన ఆటతో చెలరేగి 6-3, 7-6 (7/3)తో అల్కరాస్‌ను ఓడించాడు.
ఇండియన్ వెల్స్‌లో వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాస్‌కు చుక్కెదురైంది. ఎదురైన ప్రత్యర్ధినల్లా చిత్తుగా ఓడించి సెమీఫైనల్ చేరిన అతడు ముందంజ వేయలేకపోయాడు. రష్యా స్టార్ డానిల్ మెద్వెదేవ్ ధాటికి అల్కరాస్ తలవంచక తప్పలేదు. ఆదివారం జరిగిన సెమీస్‌లో తొలి సెట్‌ను 6-3తో అలవోకగా గెలిచిన మెద్వెదేవ్‌కు రెండో సెట్లో గట్టి పోటీనిచ్చాడీ టాప్ సీడ్. 7-6తో సెట్ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. అయితే.. నిర్ణయాత్మక సెట్లో గొప్పగా ఆడిన మెద్వెదేవ్ అజేయంగా దూసుకెళ్తున్న అల్కారస్ను ఓడించాడు.
The moment Daniil Medvedev inflicted Alcaraz’s FIRST defeat of 2026#TennisParadise pic.twitter.com/Q4r7kR5kIT
— Tennis TV (@TennisTV) March 15, 2026
మ్యాచ్ అనంతరం కోర్టులో రష్యా ఆటగాడు మాట్లాడుతూ ‘వరల్డ్ నంబర్ 1 ను ఓడించాలంటే అతడితో సమానంగా ఆడాలి. ఈరోజు నేను అదే చేశాను’ అని అన్నాడు. ‘కార్లోస్ వంటి ఆటగాళ్లతో చాలా మ్యాచ్‌లు ఆడుతాం. వాటిలో చాలాసార్లు ఓడిపోతాం. అతడు అద్భుతమైన ఆటగాడు. అలాంటి ప్లేయర్‌ను ఓడించాలంటే అత్యద్భుతంగా ఆడాలి. నేను అదే చేశాను’ అని మెద్వెదేవ్ చెప్పగా.. గొప్పగా ఆడినందుకే అతడు గెలిచాడని అల్కరాస్ అన్నాడు.
‘మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకూ అతడు నమ్మశక్యంకాని విధంగా ఆడాడు. అతడు అంతలా చెలరేగడం నేను ఎప్పుడూ చూడలేదు. నిజాయతీగా చెబుతున్నా.. డానిల్ ఈ విజయానికి అర్హుడు’ అని అల్కరాస్ తెలిపాడు. టైటిల్ కోసం జన్నిక్ సిన్నర్‌తో మెద్వెదేవ్ తలపడనున్నాడు.