Xiaomi 17 : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్త షావోమీ తాజాగా రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది. లైకా పార్ట్నర్షిప్తో ఈ ఫోన్లు రూపొందాయి. ఇవి హైఎండ్ ఫోన్లు కాబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటాయి. ఈ ఫోన్లలోని ఫీచర్లివి.
షావోమీ 17
6.3 అంగుళాల 1.5 కే ఓలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ అడాప్టివ్ రిఫ్రెష్రేట్, 300 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3 ఎన్ఎం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5వ జనరేషన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, హైపర్ ఓఎస్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6,330 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, ఏఐ పవర్డ్ ఫేస్ అన్లాక్, ట్రిపుల్ మెయిన్ కెమెరా (50 ఎంపీ రేర్, 50 ఎంపీ టెలీఫొటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్), 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 191 గ్రాముల బరువు, 8.06 ఎంఎం థిక్నెస్, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ. ధర రూ.89,999 / రూ. 99,999.
షావోమీ 17 అల్ట్రా
6.9 అంగుళాల హైపర్ ఆర్జీడీ ఓలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ అడాప్టివ్ రిఫ్రెష్రేట్, 300 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, షావోమీ ఫీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ 3.0, అల్యూమినియం ఫ్రేమ్ 3 ఎన్ఎం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5వ జనరేషన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, హైపర్ ఓఎస్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, ఏఐ పవర్డ్ ఫేస్ అన్లాక్, ట్రిపుల్ మెయిన్ కెమెరా (50 ఎంపీ రేర్, 200 ఎంపీ టెలీఫొటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్), 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 218 గ్రాముల బరువు, 8.06 ఎంఎం థిక్నెస్, 16జీబీ+512జీబీ సింగిల్ వేరియెంట్, బ్లా్క్, వైట్ కలర్లో లభిస్తుంది. ధర రూ.1,39,999. ఈ నెల 17 లోపు కొనుగోలు చేసిన వారికి ఫొటోగ్రఫీ కిట్ ఉచితం అని కంపెనీ పేర్కొంది. ఇక వివిధ కార్డులపై డిస్కౌంట్లు కూడా ఉంటాయి. ఆన్లైన్ పోర్టల్లో కొనుగోలు చేయవచ్చు.