నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు!
అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించడానికి పిటిషనర్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- మహిళల ఉపాధికే ముప్పు ఏర్పడుతుందని వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 13 : అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించడానికి పిటిషనర్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. చట్టం ద్వారా నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళల ఉపాధిపై ఊహించని పరిణామాలు సంభవించ వచ్చని విచారణ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మహిళలను యాజమాన్యాలు నియమించుకోకుండా నిరుత్సాహపరచవచ్చని, తద్వారా వారు శ్రామికశక్తిలో పాల్గొనడంలో ప్రతికూల ప్రభావం చూపగలదని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠీ అర్హతలను ప్రశ్నించిన ధర్మాసనం ఈ విషయమై ఏ మహిళ కూడా కోర్టును ఆశ్రయించలేదని స్పష్టం చేసింది.
పురుషులతో సమానంగా లేమనే భావన కలిగిస్తాయి..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంసద్ వాదనలు వినిపిస్తూ కేవలం కర్ణాటక ప్రభుత్వం మాత్రమే నెలసరి సెలవును అనుమతించేందుకు విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నెలసరి సెలవులు ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. తాము పురుషులతో సమానంగా లేమన్న భావన మహిళల్లో కలిగిస్తాయని, ఒక నిర్దిష్ట సమయంలో పురుషులతో సమానంగా మహిళలు పనిచేయలేరన్న ఒక రకమైన అభిప్రాయాన్ని సృష్టించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని సీజేఐ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

