గురుగ్రామ్: ఒక బాలికను డెలివరీ బాయ్ కిడ్నాప్ చేశాడు. ఆమెకు ఫుడ్ ఇస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Delivery Boy Kidnaps, Rapes Girl) బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 1న సెక్టార్ 93లో నివసించే 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బాలిక కిడ్నాప్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్టార్ 83లో నివసించే నిందితుడైన 21 ఏళ్ల సమద్‌ను కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా అతడు పని చేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఫుడ్ ఇస్తానని ప్రలోభపెట్టి బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పారు. కిడ్నాప్, పోక్సో చట్టంలోని సెక్షన్ కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Murders Daughter, Kills Self | కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం