Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒక విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాము (17)గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులను హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.