వాషింగ్టన్: రష్యాపై ఆంక్షల బిల్లును శుక్రవారం అమెరికా సేనేట్(US Senate) ఆమోదించింది. దీని వల్ల అమెరికా, చైనా లాంటి దేశాలకు భారీ టారిఫ్ ప్రమాదం పొంచి ఉన్నది. రష్యా వద్ద ఇంధనం, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై సుమారు వంద శాతం వరకు అమెరికా టారిఫ్ విధించే అవకాశాలు ఉన్నాయి. రష్యా వద్ద ఆయిల్ కొనడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, దీని వల్ల ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యా మీద ఆధారపడే దేశాలకు షాక్ ఇవ్వాలని ట్రంప్ సర్కారు ఆలోచిస్తున్నది.
దివంగత రిపబ్లికన్ సేనేటర్ లిండ్సే ఓ గ్రహమ్ పేరు మీద ఆ బిల్లను సేనేట్‌లో పాస్ చేశారు. 86-11 ఓట్ల తేడాతో ఆ బిల్లు ఓకే అయ్యింది. రష్యాపై ఆర్థిక వత్తిడి తేవాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. మాస్కోతో ఇంధన వాణిజ్యం నిర్వహిస్తున్న దేశాలను టార్గెట్ చేయాలని అమెరికా భావిస్తున్నది. ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా దగ్గర ఆయిల్ కొనే దేశాలపై వంద శాతం టారిఫ్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇండియా, చైనాతో పాటు మొత్తం 5 కీలక దేశాలపై ఆ ప్రభావం పడనున్నది.