అహ్మదాబాద్: ఆడ సింహంపై మగ సింహం దాడి చేసింది. తన బలంతో దానిని వశపర్చుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆడ సింహం తీవ్రంగా ప్రతిఘటించింది. మగ సింహంపై ఎదురు దాడి చేసింది. (Lion Attacks Lioness) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సింహాలకు నిలయమైన గుజరాత్‌లోని గిర్ అడవిలో ఈ సంఘటన జరిగింది. ఒక మగ సింహం ఆడ సింహాన్ని సమీపించింది. అయితే సంభోగానికి సిద్ధంగా లేని అది తన ప్రవర్తన ద్వారా వ్యతిరేకత వ్యక్తం చేసింది. దగ్గరకు వస్తున్న మగ సింహంపై గర్జిస్తుంది.
కాగా, మగ సింహం కాస్త వెనక్కి తగ్గింది. అయితే మళ్లీ ఆడ సింహం వద్దకు అది వెళ్లింది. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఆడ సింహం ప్రయత్నించింది. తన పంజాలతో మగ సింహంపై తీవ్రంగా దాడి చేసింది. సాధారణంగా మేటింగ్ సమయంలో ఆడ సింహాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి లొంగదీసుకునేందుకు మగ సింహాలు ఇలా ప్రవర్తిస్తుంటాయి.
మరోవైపు రాజ్యసభ సభ్యుడు, వన్యప్రాణుల ఔత్సాహికుడైన పరిమల్ నత్వానీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘అడవిలో బలం, మనుగడకు శక్తి పరీక్ష వంటింది. బలమైనది మాత్రమే సర్వోన్నతంగా రాజ్యమేలుతుంది’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In the wild, power is a test of strength and survival – only the strongest reign supreme.@GujForestDept @moefcc #GirWildlife #AsiaticLion #Gir pic.twitter.com/tkLrhtdRni
— Parimal Nathwani (@mpparimal) October 5, 2025
Also Read:
Tejashwi Yadav | నితీశ్ వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్.. ఆయన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు
Woman, Lover Kills Daughter | మూడేళ్ల కుమార్తెను చంపిన మహిళ.. ఆమెతోపాటు ప్రియుడు అరెస్ట్
Watch: ఆటోను భుజాలపై మోసి నదిని దాటించిన స్థానికులు.. ఎందుకంటే?