పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వీడియో క్లిప్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) షేర్ చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ ఉండిపోయారు.
కాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. సీఎం నితీశ్ కుమార్ మానసిక ఆరోగ్యం, ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా కాలంగా సరైన మానసిక స్థితిలో లేరన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘ముఖ్యమంత్రి ఈ మానసిక స్థితికి ఆయన సన్నిహితులు కారణమా?’ అని ఆ పోస్ట్‌లో ప్రశ్నించారు. నితీశ్ కుమార్ ఆహారంలో వారు ఏదో కలుపుతున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరోవైపు సాధారణ మహిళలతో పాటు, తన తల్లి రబ్రీ దేవి గురించి నితీశ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ‘ఆయన వికృత ప్రవర్తనకు మరో ఉదాహరణను నిన్న మనం చూశాం. ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం సీఎంకు లేదు. ఒక సిండికేట్ ఆయనపై దాడి చేస్తోంది. అది త్వరలో బయటపడుతుంది’ అని మీడియాతో అన్నారు.
एक प्रदेश के मुख्यमंत्री को इस दयनीय स्थिति में देख आपको कैसा लग रहा है? क्या अजीब हरकते करते मा॰ मुख्यमंत्री जी आपको मानसिक रूप से स्वस्थ दिखाई दे रहे है?
क्या साजिशन इनकी ऐसी हालत बीजेपी के इशारे पर इनकी ख़ास भूंजा पार्टी ने प्रसाद या अन्य खाद्य पदार्थ खिलाने के बहाने की है?… pic.twitter.com/1JhRwi8DoR
— Tejashwi Yadav (@yadavtejashwi) October 5, 2025
Also Read:
Watch: ఆటోను భుజాలపై మోసి నదిని దాటించిన స్థానికులు.. ఎందుకంటే?
Woman, Lover Kills Daughter | మూడేళ్ల కుమార్తెను చంపిన మహిళ.. ఆమెతోపాటు ప్రియుడు అరెస్ట్