ముంబై: ఒక వ్యక్తి నాలుగు నెలల కుమారుడ్ని డ్రమ్‌లో ముంచి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Drowns Son In Drum, Dies By Suicide) ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తల్వాడ గ్రామానికి చెందిన అమోల్ సోనావానే శనివారం తన బిడ్డను కడతేర్చాడు. నీలిరంగు డ్రమ్‌లో సగం వరకు ఉన్న నీటిలో నాలుగు నెలల కుమారుడ్ని ముంచి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అమోల్, అతడి బిడ్డ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రెండు రోజుల కిందట ఇంట్లో గొడవల వల్ల భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పొరుగువారు సకాలంలో వారిని రక్షించినట్లు చెప్పారు. ఆ దంపతులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఆ తర్వాత అమోల్ తన నెలల కుమారుడ్ని డ్రమ్‌లో ముంచి చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు.
Also Read:
Man jumps Into Yamuna With Children | ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త