లక్నో: ఒక వ్యక్తి 14 ఏళ్ల తర్వాత తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. హంతకుడిపై కాల్పులు జరిపి చంపాడు. (Man Avenges Father’s Murder) పారిపోయిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళోరా గ్రామానికి చెందిన 45 ఏళ్ల జైవీర్ 2011లో బ్రిజ్‌పాల్‌ను హత్య చేశాడు. ఈ కేసులో 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో నివసిస్తున్నాడు.
కాగా, తండ్రి బ్రిజ్‌పాల్ హత్యకు ప్రతీకారం కోసం కుమారుడైన 30 ఏళ్ల రాహుల్ ఎదురుచూశాడు. శనివారం పొలం నుంచి ఇంటికి వెళ్తున్న జైవీర్పై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జైవీర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి హత్యకు ప్రతీకారంగా రాహుల్ అతడ్ని చంపినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రాహుల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Man Murdered for insurance | రూ.5 కోట్ల బీమా కోసం వ్యక్తి హత్య.. క్లైమ్ చేసిన నకిలీ భార్య