ఇంఫాల్: మణిపూర్‌లోని చురాచంద్పూర్లో జాతి హింస కారణంగా రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన పోస్టల్ సేవలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. (Postal Services Resume) గత వారం రోజులుగా రాజధాని ఇంఫాల్ నుంచి చురాచంద్‌పూర్‌కు సాధారణ మెయిల్ వ్యాన్లు వస్తున్నాయి. దీంతో పోస్టల్ సేవలు పునఃప్రారంభమయ్యాయి.
కాగా, మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య రెండేళ్లుగా హింసాకాండ కొనసాగింది. అల్లర్లు, దాడుల్లో 250 మందికి పైగా మరణించగా వేల సంఖ్యలో గాయపడ్డారు. సుమారు 62,000 మంది నిరాశ్రయులయ్యారు.
మరోవైపు ఈ హింసాకాండలో అత్యంత ప్రభావితమైన జిల్లాల్లో చురాచంద్పూర్ ఒకటి. దీంతో గత రెండేళ్లుగా ఈ జిల్లాలో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. లేఖలు, పార్శిళ్లు, ఇతర సరుకుల డెలివరీ స్తంభించిపోయింది. అయితే మణిపూర్ గత ఎనిమిది నెలలుగా రాష్ట్రపతి పాలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటున్నది.
Also Read:
Man jumps Into Yamuna With Children | ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు