లక్నో: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇది తెలిసిన ఆమె భర్త నలుగురు పిల్లలతో కలిసి నదిలోకి దూకాడు. (Man jumps Into Yamuna With Children) ఆత్మహత్యకు ముందు అతడు రికార్డ్ చేసిన వీడియోను సోదరికి పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు వారి కోసం ఆ నదిలో గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన జరిగింది. సల్మాన్, ఖుష్నుమా దంపతులకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. నలుగురు పిల్లలైన 12 ఏళ్ల మహక్, ఐదేళ్ల షిఫా మూడేళ్ల అమన్, ఎనిమిది నెలల శిశువు ఇనైషా ఉన్నారు.
కాగా, ఖుష్నుమాకు ప్రియుడు ఉన్నట్లు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న సల్మాన్, ఖుష్నుమా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆగ్రహించిన ఖుష్నుమా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ప్రియుడితో కలిసి పారిపోయింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తన నలుగురు పిల్లలను తీసుకుని యమునా నది బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడే ముందు వీడియో రికార్డ్ చేశాడు. తమ చావుకు భార్య, ఆమె ప్రియుడు కారణమని ఆరోపించాడు. ఈ వీడియోను సోదరికి పంపాడు. ఆ తర్వాత నలుగురు పిల్లలతో కలిసి యమునా నదిలోకి దూకాడు.
కాగా, ఈ వీడియో చూసిన సల్మాన్ సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు యమునా నది వద్దకు చేరుకున్నారు. సల్మాన్, అతడి పిల్లల కోసం గజ ఈతగాళ్లతో ఆ నదిలో గాలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
😡Wife left with her boyfriend 2 days ago, and since then, he has been depressed.
He jumped into the Yamuna River with his 4 children. The search for all five is ongoing.pic.twitter.com/tzfHgLpWUT
— ShoneeKapoor (@ShoneeKapoor) October 4, 2025
Also Read:
Man Murdered for insurance | రూ.5 కోట్ల బీమా కోసం వ్యక్తి హత్య.. క్లైమ్ చేసిన నకిలీ భార్య
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు