The Kerala Story | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. సినిమాలో చూపించిన అంశాలు కేరళ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శిస్తూ, ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని ఆయన సూచించాడు.
ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో కేరళకు చెందిన ప్రసిద్ధ వంటకాల (భీఫ్ కర్రీ) ఫోటోలను షేర్ చేస్తూ.. అసలైన కేరళస్టోరీ ఏమిటంటే.. నోరూరించే కేరళ ఆహార ప్రయాణం. అక్కడి సిరియన్ క్రిస్టియన్ ‘బీఫ్ ఫ్రై’, కొబ్బరితో చేసిన ‘బీఫ్ కర్రీ’ ఆ రాష్ట్ర చరిత్రకు, సంస్కృతికి మరియు వారసత్వానికి అద్దం పడతాయి. దయచేసి వీటిని ఒకసారి రుచి చూడండంటూ ప్రకాశ్ రాజ్ రాసుకోచ్చాడు. కేరళ స్టోరీ అనే సినిమా వలన కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపిస్తోందని విమర్శలు వస్తున్న తరుణంలో.. ప్రకాష్ రాజ్ మాత్రం కేరళ అంటే మత సామరస్యం మరియు అద్భుతమైన ఆహార సంస్కృతి అని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇప్పటికే ఈ సినిమాను ప్రాపగండా అని విమర్శించగా, ప్రకాష్ రాజ్ కూడా అదే బాటలో నడిచారు. సినిమా పేరుతో కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విమర్శించాడు.
The real #KeralaStory is how… “In its mouth-watering culinary journey, Kerala’s yummy Syrian Christian beef fry and the coconut beef have added legacy, history and culture to the recipe.” Please try n relish 😜😜😜😜 #justasking pic.twitter.com/PdbYT0m0N2
— Prakash Raj (@prakashraaj) February 21, 2026