హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో(, Rangareddy district) విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి బాలిక మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంచాల మండలం తాళ్లపల్లిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిల్కీ అనే (9) బాలిక ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందింది.
అప్పటి వరకు కండ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన బిడ్డ విగతజీవిగా సంపులో తేలియాడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.