కోల్‌కతా: కొండచరియలు విరిగిపడటంతో గాయపడిన రోగులకు చికిత్స కోసం ఒక డాక్టర్ పెద్ద సాహసం చేశారు. రోడ్డు మార్గం తెగిపోవడంతో చిక్కుకున్న వారికి వైద్య సహాయం అందించేందుకు జిప్‌లైన్ సహాయంతో లోయను దాటి అక్కడకు చేరుకున్నారు. (Doctor Ziplines To Treat Patients) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 28 మంది మరణించారు.
కాగా, బామండంగా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు మరణించగా కొందరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే రోడ్డు మార్గం తెగిపోవడంతో వైద్య సహాయం అందించేందుకు అక్కడకు చేరుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోయింది.
ఈ నేపథ్యంలో నాగరకత బ్లాక్ ఆరోగ్య అధికారి ఇర్ఫాన్ పెద్ద సాహసం చేశారు. రెస్క్యూ సిబ్బంది సహాయంతో జిప్‌లైన్ ద్వారా లోయను దాటి అక్కడకు చేరుకున్నారు. కొండచరియలు విరిగిపడటంతో గాయపడిన వారికి చికిత్స అందించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ డాక్టర్ సాహసాన్ని, విధి నిర్వహణ పట్ల ఆయన అంకితభావాన్ని పలువురు ప్రశంసించారు.
All Heroes don’t wear capes…
True Heroes are those that help people in the darkest of times. One such Hero was spotted swinging by a rope amidst the landslide affected North Bengal…
The incident took place in Nagrakata.
The person swinging by a rope over a gorge is 𝐃𝐫.… pic.twitter.com/SWLqgazHhO— 𝐑𝐢𝐣𝐮 𝐃𝐮𝐭𝐭𝐚 (@DrRijuDutta_TMC) October 7, 2025
Also Read:
Watch: విద్యార్థిపై పోలీస్ అధికారి ప్రతాపం.. యువకుడిని కొట్టి తిట్టిన వీడియో వైరల్
Watch: కుక్కల బెడదపై వీధి నాటకం.. ఆర్టిస్ట్‌ను కరిచిన వీధి కుక్క
Watch: ఆడ సింహంపై మగ సింహం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?