కల్వకుర్తి, మార్చి 1 : కల్వకుర్తి పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అవస రం ఉన్నంత మేరకు యూరియా ఇవ్వాలని డి మాండ్ చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకువచ్చి చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల బస్తాల యూరియా అవస రం ఉన్న చోట వందల బస్తాల యూరియా ఏ మూలకు సరిపోతుందని, యూరియా కొరత తో పంటల దిగుబడి తగ్గితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేశా రు. యూరియా ఇవ్వడం చేతగాకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాల ని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ని నాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఏ ఒక్కరోజు కూడా ఎరువుల బస్తాల కో సం ఎదురు చూడలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో
దాదాపు 12వందల బస్తాల యూరియా మూడు దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని, ఉదయం 10 గంటలకు యాప్‌లో యూ రియా బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారుల రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైతులు ఉదయం 9గంటల వరకు రైతులు సద రు దుకాణాల వద్దకు చేరుకున్నారు. సరిగ్గా 10 గంటలకు యాప్ తెరిచిపెట్టుకున్న రైతుల ఆనం దం అర నిమిషం కూడా నిలువలేదు. అర నిమిషంలోనే యూరియా స్టాక్ జీరో అయిపోయింది. వందల మంది రైతులకు యూరి యా లభించకపోవడంతో వారిలో ఆగ్ర హం కట్టలు తెంచుకుంది. పంటలకు యూరియా అత్యవసరం అయిన క్రమంలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు..
ధర్నాకు దిగిన రైతులు రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. యూరియా ఇవ్వలేని రేవంత్ తన ముఖ్యమం త్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చే శారు. యూరియా పంపిణీ చేతకాక ఫర్టిలైజర్ యాప్ తీసుకు వచ్చి ప్రభుత్వం చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల సంఖ్యలో యూరియా బస్తాలు అవసరం ఉంటే.. వందల సంఖ్యలో సరఫరా చేస్తున్నారని.. దీంతో యూరియా కో సం అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు యాప్‌పై అవగాహన లేదని, చాలామంది రైతులకు స్మా ర్ట్ ఫోన్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో పంటలకు వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని.. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఒక్క చోటకు చేరితే.. ఆందోళనలు చేస్తారనే భయంతోనే ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ తీసుకువచ్చిందని రైతులు ఆరోపించారు. యూరియా కోసం అరిగోస పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూ రియాను రైతులు స్టాక్ చేసుకుంటున్నారని కొం తమంది ప్రజాప్రతినిధులు బాధ్యత రాహిత్యం గా మాట్లాడుతున్నారని రైతులు మండిపడ్డారు. యూరియా ఏమైన బంగారమా లేదా తినే తిం డిపదార్థమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కో సం ఏనాడు కూడా ఎదురు చూడలేదని, కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎరువు ల కోసం అరిగోస తప్పడం లేదని వాపోయా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలకు సరిపోయినన్ని యూరియా బస్తాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.
పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ
సీఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు ధ ర్నా ప్రాంతానికి చేరుకుని రైతులతో మాట్లాడా రు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించ వద్దని రైతులకు సూచించారు. అధికారు లు అందుబాటులో ఉండరని ఆదివారం రోజు న ధర్నా చేస్తే ఏం ప్రయోజనముంటుందని, ధ ర్నా విరమించాలని రైతులకు నచ్చ జెప్పారు. చివరకు పోలీసుల జోక్యంతో రైతులు తమ ధర్నాను విరమించారు.