లక్నో: ఒక స్టూడెంట్‌పై పోలీస్ అధికారి ప్రతాపం చూపించాడు. ఆ యువకుడి చెంపపై కొట్టడంతో పాటు తిట్టాడు. (SI Slaps, Kicks Student) ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నరమౌ ప్రాంతానికి చెందిన విద్యార్థి అక్షయ్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై కిద్వాయ్ నగర్‌కు బయలుదేరాడు.
కాగా, ఒక క్రాసింగ్ వద్ద తనిఖీ కోసం బైక్ ఆపమని ఒక పోలీస్ చెప్పాడు. అయితే అక్షయ్ బైక్ వేగం పెంచడంతో పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడున్న ఎస్ఐ అమిత్ త్రిపాఠీ సింగ్ ఆ విద్యార్థి కాలర్ పట్టుకుని లోపలికి లాగాడు. అయితే అలాంటి చర్య చట్ట విరుద్ధమని అక్షయ్ అన్నాడు. దీంతో ఎస్ఐ త్రిపాఠీ సింగ్ సహనం కోల్పోయాడు. ఆ విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టాడు. అతడ్ని తన్నడంతోపాటు దుర్భాషలాడాడు.
మరోవైపు అక్షయ్ స్నేహితుడు దీనిని రికార్డ్ చేస్తానని పోలీసులతో అన్నాడు. అలా చేస్తే నిన్ను కూడా కొడతానని ఆ ఎస్ఐ బెదిరించాడు. అయితే అప్పటికే మొబైల్లో రికార్డ్ అయిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ త్రిపాఠీ సింగ్‌పై చర్యలు చేపట్టారు. పోలీస్ లైన్‌కు ఆయనను అటాచ్ చేశారు. ఆ ఎస్ఐ దురుసు ప్రవర్తనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
This is UP police sub-inspector Amit Tripathi, posted in Kanpur. His style of resolving a complaint – a slap to the face and kick to the complainant’s abdomen. His fluency with abuses matches the department standards. pic.twitter.com/Lnjb2PdCn8
— Piyush Rai (@Benarasiyaa) October 6, 2025
किदवईनगर थाना क्षेत्र के वायरल वीडियों का संज्ञान लेकर पुलिस उपायुक्त दक्षिण महोदय द्वारा चौकी प्रभारी को लाइन हाजिर किया गया, इस सम्बन्ध में सहायक पुलिस आयुक्त बाबूपुरवा द्वारा दी गई बाइट @Uppolice @dcpskanpur pic.twitter.com/pwmtQOF4La
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) October 5, 2025
Also Read:
Bypolls to 8 assembly seats | నవంబర్ 11న.. 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
Gold Coins | బంగారు నాణేల ఆర్డర్ పేరుతో.. రూ.5 కోట్లకుపైగా యజమానిని మోసగించిన ఉద్యోగి
Watch: కుక్కల బెడదపై వీధి నాటకం.. ఆర్టిస్ట్‌ను కరిచిన వీధి కుక్క