న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. (Bypolls to 8 assembly seats) నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తామని వెల్లడించారు.
కాగా, ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచిన తర్వాత రాజీనామా చేసిన బుద్గామ్, ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఖాళీ అయిన నగ్రోటా స్థానాలకు బై ఎలక్షన్స్ జరుగనున్నాయి.
మరోవైపు రాజస్థాన్‌లోని అంటా ఎమ్మెల్యే కన్వర్లాల్ మీనా దోషిగా తేలి అనర్హత వేటు పటడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. జార్ఖండ్‌లోని ఘట్సిలా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, తెలంగాణలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, పంజాబ్‌లోని తర్న్ తరణ్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సోహల్, మిజోరాంలోని డంపా నియోజకవర్గం ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా, ఒడిశాలోని నువాపాడ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణించిన నేపథ్యంలో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ జారీ చేసింది.
By Polls
Also Read:
Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్
Tejashwi Yadav | నితీశ్ వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్.. ఆయన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు
Delhi CM Rekha Gupta | బ్రాహ్మణులు సమాజంలో జ్ఞాన జ్వాల వెలిగిస్తారు: రేఖా గుప్తా