రజకులపై దాడి దుర్మార్గం.. రజక సంఘం నాయకుల డిమాండ్
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం తమ పోరాటాన్ని ఆపదని హెచ్చరించారు.
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 23 : కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం తమ పోరాటాన్ని ఆపదని హెచ్చరించారు. ఈ మేరకు కరీంనగర్, హుజూరాబాద్‌లో ధర్నాలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ రజక మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
శంకరపట్నంలో రజక సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్-వరంగల్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి విరమింపజేశారు. పెద్దపల్లిలో దాసరి ఉష కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మంథనిలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఆయాచోట్ల నాయకులు మాట్లాడుతూ, రజకులను కులం పేరుతో దూషిస్తూ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎదురు తిరిగినందుకు విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ దాడిలోనే రెండు నెలల పసికందు మరణించడం అత్యంత విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

