న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) కుల పరంగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు సమాజంలో జ్ఞాన జ్వాలను వెలిగిస్తారని అన్నారు. గ్రంథాలు, ఆయుధాల ద్వారా మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మనం రక్షించగలం అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని పితంపురాలో బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో అఖిల భారత బ్రాహ్మణ సమావేశం జరిగింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘సమాజంలో ఎవరైనా జ్ఞాన జ్వాలను వెలిగిస్తున్నారంటే అది మన బ్రాహ్మణ సమాజమే. వారు గ్రంథాలను మాత్రమే కాకుండా ఆయుధాలను కూడా పూజిస్తారు. ఆయుధాలు, గ్రంథాల ద్వారా మాత్రమే మనం నేడు సమాజాన్ని, దేశాన్ని రక్షించగలం’ అని అన్నారు.
కాగా, జ్ఞాన జ్వాలను వెలిగించడం ద్వారా, మతాన్ని ప్రచారం చేయడం ద్వారా, సద్భావన స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా బ్రాహ్మణ సమాజం ఎల్లప్పుడూ సమాజ ప్రయోజనం కోసం పనిచేసిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారిని ముందుకు తీసుకెళ్లడానికి బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు.
మరోవైపు ఢిల్లీలో మన లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో దయచేసి మీ సూచనలు అందించాలని బ్రాహ్మణ సమాజాన్ని రేఖా గుప్తా కోరారు. అయితే సీఎం స్థాయిలో ఉన్న ఆమె ఒక కులాన్ని ఉన్నతంగా పేర్కొంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:
MGR’s Statue Vandalised | మదురైలో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం.. అన్నాడీఎంకే నేతలు నిరసన
Tejashwi Yadav | నితీశ్ వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్.. ఆయన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు
Watch: ఆడ సింహంపై మగ సింహం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?