చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. (MGR’s Statue Vandalised) మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురంలో ఈ సంఘటన జరిగింది. ప్రసిద్ధ జల్లికట్టు అరేనా సమీపంలో ఉన్న 3.5 అడుగుల ఎంజీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. పీఠం నుంచి ఆ విగ్రహాన్ని పెకలించడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కూలిన ఎంజీఆర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై నిరసన తెలిపారు. బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవనియాపురం పోలీసులకు పార్టీ జిల్లా నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి (ఈపీఎస్) ఈ సంఘటనను ఖండించారు. ఎంజీఆర్ కీర్తి, విధానాలను ఎదుర్కోలేని వారు ఈ పిరికి చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:
Tejashwi Yadav | నితీశ్ వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్.. ఆయన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు
Watch: ఆటోను భుజాలపై మోసి నదిని దాటించిన స్థానికులు.. ఎందుకంటే?
Watch: ఆడ సింహంపై మగ సింహం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?