అగ్రహీరో రామ్‌చరణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా ప్రస్టేజియస్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఏ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచిన ‘చికిరి’ సాంగ్ అయితే.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇదిలావుంటే.. తాజాగా హీరో రామ్‌చరణ్ ‘పెద్ది’ డబ్బింగ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు రామ్‌చరణ్. ఒక్క తెలుగులోనే కాక, అన్ని భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పబోతున్నట్టు ఈ వీడియోలో పేర్కొన్నారాయన.
అంతేకాకుండా.. ‘చికిరి’ పాటపై దర్శకుడు బుచ్చిబాబుతో జరిపిన తన సంభాషణ కూడా ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ని ఇస్తున్నది. అలాగే.. ఈ వీడియోలో ‘ఏమది’ అంటూ సినిమాలోని ఓ చిన్న డైలాగ్‌ని కూడా రామ్‌చరణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సోమవారం ఈ సినిమా నుంచి రెండో పాట ‘రై రై రారా’ కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, దివేందుశర్మ, బోమన్ ఇరానీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, నిర్మాత: వెంకటసతీష్ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.