INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ(58 నాటౌట్) చెలరేగుతోంది. బౌండరీలతో హోరెత్తిస్తున్న షఫాలీ అర్ధ శతకంతో మెరిసింది. పవర్ ప్లేలోనే ఫిఫ్టీకి చేరువైన ఈ లేడీ సెహ్వాగ్.. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుంది. టీ20ల్లో షఫాలికి ఇది 21వ అర్ధ శతకం. మరో ఎండ్లో స్మృతి మంధాన(32 నాటౌట్) సైతం బాదేస్తుండగా భారత స్కో్ర్ బోర్డు పరుగులు తీస్తోంది.
మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియాకు శుభారంభమిస్తూ.. ఇన్నింగ్స్ మొదటి బంతినే స్మృతి మంధాన(32 నాటౌట్) బౌండరీకి తరలించగా.. ఆ తర్వాత కవిశ దిల్హరి ఓవర్లో షఫాలీ వర్మ(58 నాటౌట్) రెండు ఫోర్లతో చెలరేగింది. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలోనే వికెట్ పడకుండా టీమిండియా 57 పరుగులు చేసింది.
కాసేపటికే కవిశ ఓవర్లో బౌండరీతో అర్ధశతకం అందుకుంది షఫాలీ. 24 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ సాధించింది తను. లంక బౌలర్లపై ఇద్దరూ విరుచుకుపడడంతో 9 ఓవర్లలో 91రన్స్ చేసిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
Shafali Verma slams the fastest fifty (off 24 balls) of the women’s T20 Asia Cup 💪
Follow live: https://t.co/59rH4gE5FS pic.twitter.com/eAeeVMrfM6
— Cricinfo (@cricinfo) September 13, 2026