KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనలకు సంబంధించి మహేందర్‌రెడ్డి, మహేశ్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు సూచించింది.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా మహేందర్‌రెడ్డి, మహేశ్‌కు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పండుగ రోజునే విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.