Asian Games | మిక్స్డ్ రీలేలో రజతం.. మారథాన్‌లో సీమకు చరిత్రాత్మక కాంస్యం..!
Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఐదో రోజు షూటర్లు వెండి వెలుగులు విరజిమ్మగా.. అథ్లెట్లు కూడా పోడియంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఐదో రోజు షూటర్లు వెండి వెలుగులు విరజిమ్మగా.. అథ్లెట్లు కూడా పోడియంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. పది వేల మీటర్ల పరుగులో సీమా కుమారి కంచు మోత మోగించింది. సీమ కాంస్యం అందుకున్న ఇరవై నిమిషాల్లోనే మిక్స్డ్ రీలే(4×400 మీటర్ల) ఫైనల్లో భారత బృందం రజతం ఒడిసిపట్టింది. ఫలితంగా భారత్ ఖాతాలో 17 పతకాలు చేరాయి.
జపాన్‌లోని నగోయలో జరుగుతున్న పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకపోరులో దూసుకెళ్తున్నారు. మిక్స్డ్ రీలే (4×400 మీటర్ల) విభాగంలో . మిక్స్డ్ విభాగం ఫైనల్లో పూవమ్మ రాజు, విశాల్ థెన్నరసు, విథ్యా రామరాజు, మను టీఎస్లు రెండో స్థానంతో రజతం గెలుపొందారు. గురువారం ఫైనల్లో.. విథ్యా, విశాల్ చిరుతలా పరుగెత్తారు. వీరి కృషి ఫలితంగా ఈ టోర్నీలో తమ రికార్డును కాపాడుకుంది మిక్స్డ్ రీలే బృందం. ఇదివరకు 2018లో స్వర్ణం, 2022 ఎడిషన్‌లో భారత టీమ్ రజతం గెలుపొందింది.
AFTER 16 LONG YEARS, INDIA HAS WON A MEDAL IN THE 10,000 M
Seema Kumari has done the country proud by winning the bronze. She kept a steady pace throughout, did not get fazed by the legendary Yavi. 32.50.05 – seema’s timingVideo courtesy: Sonyliv#bronzeforindia #asiangames2026… pic.twitter.com/ADmLgL8YJv
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 24, 2026
అంతకుముందు.. మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారి సత్తా చాటింది. ఈ మారథాన్ రేసులో 16 ఏళ్లుగా పతకం కోసం నిరీక్షిస్తున్న భారత్‌ను సంబురాల్లో ముంచెత్తింది. ఫైనల్లో 32:50:05 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని ముద్దాడిందీ హిమాచల్ ప్రదేశ్ అథ్లెట్. ఆమె మూడో స్థానానికి పరిమితమవ్వగా.. విన్‌ఫ్రెడ్ యవీ(బహ్రెయిన్) పసిడి, నొజొమి(జపాన్) వెండి పతకాలు సాధించారు.
Silver shine in Nagoya! 🥈🇮🇳✨
Tiranga up, arms raised: pure joy from our Mixed 4x400m relay stars after a thrilling 3:14.46 🔥
Poovamma M.R. | Vishal T.K. | Vithya Ramraj | Manu T.S. 💪#AsianGames2026 #TeamIndia #IndianAthletics #Nagoya2026 pic.twitter.com/hvO0jMuPIn
— Athletics Federation of India (@afiindia) September 24, 2026
కామన్వెల్త్ క్రీడల్లో విఫలమైన భారత చిరుత గురిందెర్విర్ సింగ్ ఈసారి అంచనాలు అందుకున్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడితో పాటు ఇండియన్ బోల్ట్ అనిమేశ్ కుజుర్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల కబడ్డీలో భారత జట్టు దర్జాగా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో తో చైనీస్ తైపీని ఇండియా చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

