MBBS Student Drugged, Raped | ‘డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడు’.. సహ విద్యార్థిపై ఎంబీబీఎస్ విద్యార్థిని ఫిర్యాదు
MBBS Student Drugged, Raped | ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో హోటల్‌కు రప్పించి డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో హోటల్‌కు రప్పించి డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. (MBBS Student Drugged, Raped) దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హర్యానాలోని జింద్‌కు చెందిన 18 ఏళ్ల యువతి ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నది. కాలేజీ హాస్టల్ క్యాంపస్‌లో ఆమె నివసిస్తున్నది.
కాగా, తోటి మెడికల్ స్టూడెంట్ అయిన 20 ఏళ్ల యువకుడు సెప్టెంబర్ 9న స్నేహం పేరుతో ఆదర్శ్‌నగర్‌లోని హోటల్‌కు తనను రప్పించాడని ఆ యువతి తెలిపింది. హోటల్ రూమ్‌లో తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తన ఫొటోలు తీసి, వీడియో రికార్డ్ చేసి బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు వైద్య విద్యార్థిని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడైన తోటి మెడికో కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman, Lover Kills Daughter | మూడేళ్ల కుమార్తెను చంపిన మహిళ.. ఆమెతోపాటు ప్రియుడు అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

