ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్/కళాశాలలో వార్డెన్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
- వార్డెన్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేధింపుల ఫలితం
- మహబూబాబాద్ జిల్లా కురవిలో ఘటన
కురవి, ఫిబ్రవరి 27: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్/కళాశాలలో వార్డెన్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరీ తండాకు చెందిన పాల్తియా కిషన్‌కు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు కురవిలోని ఏకలవ్య మోడల్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా వార్డెన్ సుజాతతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది స్వప్న, లాలు, నవ్య, సృజన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ విద్యార్థినిని వేధిస్తున్నారు. దీనిపై బాధితురాలు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 25న మధ్యాహ్నం విద్యార్థిని ఫినాయిల్ తాగింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బాధితురాలి తండ్రి కిషన్ శుక్రవారం మహబూబాబాద్‌లో కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

