man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
man kills wife | ఒక వ్యక్తికి తన అత్తతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేశాడు. తన కుటుంబంతో కలిసి పారిపోయాడు. అత్తతో రిలేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: ఒక వ్యక్తికి తన అత్తతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేశాడు. (man kills wife) తన కుటుంబంతో కలిసి పారిపోయాడు. అత్తతో రిలేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిధ్‌పురాలో నివసించే ప్రమోద్, 20 ఏళ్ల శివానికి 2018లో పెళ్లి జరిగింది. అయితే శివాని తల్లి అయిన అత్తతో ప్రమోద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
కాగా, రెండు రోజుల కిందట శివాని, ప్రమోద్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్యను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి పారిపోయాడు.
మరోవైపు శివాని అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ప్రమోద్‌కు అత్తతో వివాహేతర సంబంధం ఉన్నదని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శివాని కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి
Bodies Left On Stretchers | ఫ్రీజర్ల కొరత.. స్ట్రెచర్లపైనే రోడ్డు ప్రమాద బాధితుల మృతదేహాలు
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

