హైదరాబాద్, ఆట ప్రతినిధి: జైపూర్‌లో జరుగుతున్న 42వ సబ్ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ స్విమ్మర్ ఆరుష్ దాస్ కాంస్యంతో మెరిశాడు. ఆదివారం జరిగిన బాయ్స్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో ఆరుష్.. 29.44 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మూడో స్థానంతో కాంస్యం సాధించాడు. సాయ్‌లో స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన అతడికి జాతీయ స్థాయిలో ఇదే తొలి పతకం కావడం గమనార్హం.