పాట్నా: వరద ప్రభావిత గ్రామాల ప్రజల కోసం సుమారు రూ.6 కోట్లతో వంతెన నిర్మించారు. అయితే నాలుగేళ్లైనా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. దీంతో ఈ బ్రిడ్జి నిరూపయోగంగా పడి ఉన్నది. (Bihar Bridge) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత బీహార్లో ఈ సంఘటన జరిగింది. కతిహార్ జిల్లాలోని దండ్ఖోడా బ్లాక్లో పసంత నదిపై వంతెన నిర్మించారు. 2020 సెప్టెంబర్ 3న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.6 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభించారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. అయితే నాలుగేళ్లు గడిచినా ఈ వంతెన అందుబాటులోకి రాలేదు. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఒక పిల్లర్తోపాటు అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు.
కాగా, సుమారు 12 గ్రామాల ప్రజలకు జిల్లా ప్రధాన కార్యాలయానికి దూరం తగ్గించడంతో పాటు వరదల సమయంలో ఎంతో ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. భూసేకరణ పూర్తి కాకముందే పనులు చేపట్టారని ఆరోపించారు. దీంతో వంతెన నిర్మాణం పూర్తైనప్పటికీ, అప్రోచ్ రోడ్డు, దాని కోసం ఒక పిల్లర్ పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. అధికారులు దీని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Also Read:
Mamata Banerjee | అమిత్ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.. మోదీ జాగ్రత్తగా ఉండాలి: మమతా బెనర్జీ
Woman Dies Due To Pothole | భర్త బైక్ వెనుక కూర్చొన్న భార్య.. గుంతలో పడి అదుపుతప్పడంతో ఆమె మృతి
Wife Pours Boiling Oil On Husband | నిద్రిస్తున్న భర్తపై.. మరిగిన నూనె పోసి, కారం చల్లిన భార్య