కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వరదలతో అతలాకుతలమైన ఉత్తర బెంగాల్లో మమతా బెనర్జీ బుధవారం పర్యటించారు. ఆ తర్వాత కోల్‌కతా చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షాను ‘యాక్టింగ్ పీఎం’ అని అభివర్ణించారు.
కాగా, ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌తో అమిత్ షాను మమతా బెనర్జీ పోల్చారు. ‘ప్రధానిలా ఆయన (అమిత్ షా) పనిచేస్తున్నారు. కానీ ప్రధానమంత్రి (మోదీ)కి అన్నీ తెలుసు. నేను ఇది చెప్పడానికి విచారిస్తున్నా. ఆయన (అమిత్ షా)ను గుడ్డిగా నమ్మవద్దని ప్రధానిని అభ్యర్థిస్తున్నా. ఏదో ఒక రోజు మీర్ జాఫర్ లాగా మీకు వ్యతిరేకంగా ఆయన మారతాడు! జాగ్రత్తగా ఉండండి’ అని అన్నారు. ఎన్నికల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నిర్వహణ పేరుతో అమిత్ షా ప్రభావంతో ఈసీ పనిచేస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు.
Also Read:
Woman Dies Due To Pothole | భర్త బైక్ వెనుక కూర్చొన్న భార్య.. గుంతలో పడి అదుపుతప్పడంతో ఆమె మృతి
man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్